Skip to main content

Admissions in Gurukul School for Girls: బాలికల గురుకుల ప్రవేశాలకు దరఖాస్తులు.. చివ‌రి తేదీ ఇదే..

Admissions in Gurukul School for Girls   Apply Today    Admissions Open  Intermediate First Year Admissions 2024-25    Dr. BR Ambedkar Girls' Gurukulam at Tallapalem

కశింకోట: మండలంలోని తాళ్లపాలెంలో ఉన్న డాక్టర్‌ బిఆర్‌ అంబేడ్కర్‌ బాలికల గురుకులంలో 2024–25 విద్యా సంవత్సరంలో 5వ తరగతి, ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ జి. గ్రేస్‌ తెలిపారు. నిర్దేశించిన అర్హతలతో ఫిబ్రవరి 23లోగా apbrafcet.apcfrr.in చిరునామాకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు సమర్పించాలన్నారు. 

5వ తరగతిలో ప్రవేశానికి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 2011 సెప్టెంబర్‌ 1 నుంచి 2015 ఆగస్టు 31 మధ్య, బీసీ, ఓసీలు 2013 సెప్టెంబర్‌ 1 నుంచి 2015 ఆగస్టు 31 మధ్య జన్మించి ఉండాలన్నారు. గుర్తింపు పొందిన పాఠశాలలో 2023–24 విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదివి ఉండాలన్నారు. వార్షిక ఆదాయం ఏడాదికి రూ.లక్ష దాటరాదన్నారు. ఎస్సీలకు 75 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలకు 5 శాతం, ఇతరులకు 2 శాతం ఎస్సీ కన్వర్టెడ్‌ క్రిస్టియన్‌లకు 12 శాతం వంతున సీట్ల కేటాయింపులో రిజర్వేషన్‌ ఉంటుందన్నారు. 5వ తరగతికి ప్రవేశ పరీక్ష వచ్చే మార్చి నెల 10న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జరగనుందన్నారు. ఇంకా వివరాల కోసం హెల్ప్‌లైన్‌ నెంబర్లు 8328409747, 9441075715 నంబర్లను సంప్రదించాలన్నారు. ఇంటర్‌లో ప్రవేశానికి విద్యార్థి వయస్సు 2024 ఆగస్టు 31 నాటికి 17 ఏళ్లు మించి ఉండరాదని తెలిపారు. గుర్తింపు పొందిన పాఠశాలలో 2023–24 విద్యా సంవత్సరంలో టెన్త్‌ పూర్తి చేసి ఉండాలన్నారు. వార్షిక ఆదాయం రూ.లక్ష దాటి ఉండరాదన్నారు. ఎస్సీలకు 75 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలకు 5 శాతం, ఇతరులకు 2 శాతం, ఎస్సీ కన్వర్టెడ్‌ క్రిస్టియన్‌కు 12 శాతం వంతున సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. ఇంటర్‌ ప్రవేశపరీక్ష మార్చి 10న మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు జరగనుందన్నారు. ఇంకా వివరాలకు ఇంటర్మీడియట్‌కు హెల్ప్‌లైన్‌ నంబర్లు: 6301119688, 9490671262లను సంప్రదించాలన్నారు.

చదవండి: IB Syllabus in Govt Schools: ప్రభుత్వ స్కూళ్లలో ఐబీ సిలబస్‌పై హర్షం

Published date : 02 Feb 2024 06:14PM

Photo Stories