Counselling: ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో నాల్గో విడత కౌన్సెలింగ్.. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
బాపట్ల అర్బన్: 2023 –24వ సంవత్సరానికి జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో నాల్గో విడత కౌన్సెలింగ్ అనంతరం మిగిలిన ఖాళీలను పూర్తి చేసేందుకు అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని నిజాంపట్నం ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ ఎన్.సుధాకర బాబు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్‌ఎస్‌సీ పాసై ఆపై చదువులు చదివిన ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అక్టోబర్ 7వ తేదీ రాత్రి 11.59 గంటల్లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. అనంతరం రిజిస్ట్రేషన్ ప్రింటు కాపీని డౌన్‌లోడు చేసుకోవాలన్నారు. డౌన్‌లోడు చేసుకున్న దరఖాస్తు కాపీకి అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్, జిరాక్స్ (2 సెట్స్), కలర్ పాస్ పోర్ట్ సైజు ఫొటోలు మూడు తీసుకుని అక్టోబర్ 8వ తేదీ మధ్యాహ్నం 12 లోపు ప్రభుత్వ/ప్రైవేటు ఐటీఐల్లో వెరిఫికేషన్ చేయించుకోవాలని తెలిపారు. జిల్లాలోని ఒకటి కంటే ఎక్కువ ఐటీఐలను కూడా ఎంపిక చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వ ఐటీఐలలో కౌన్సెలింగ్ ఈనెల 9వ తేదీన జరుగుతోందన్నారు. ప్రైవేట్ ఐటీఐలలో అక్టోబర్ 10వ తేదీన కౌన్సెలింగ్ జరుగుతోందని వెల్లడించారు. పూర్తి వివరాలకు మొబైల్ నెంబర్ 9849479524లో సంప్రదించాలన్నారు. గవర్నమెంట్ ఐటీఐ నిజాంపట్నం ఆఫీసు పనివేళల్లో సంప్రదింవచ్చన్నారు.