Sakshi education logo

Advertisement

సెప్టెంబర్ 7న యథావిధిగా సచివాలయ పరీక్షలు

సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్ విభాగానికి చెందిన 11,158 సచివాలయ ఉద్యోగుల పోస్టులకు సెప్టెంబర్ 7న యథావిధిగా పరీక్షలు జరుగుతాయని పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ బి.సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
Edu news ఈ పరీక్షలను సవాల్ చేస్తూ కొంతమంది హైకోర్టుకు వెళ్లడంతో వీరి అభ్యంతరాలను పరిశీలించి, ఒక నిర్ణయం తీసుకుని పరీక్ష నిర్వహించాల్సిందిగా కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. పంచాయతీరాజ్ శాఖలో ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ ఉద్యోగుల అభ్యంతరాలను క్షుణ్నంగా పరిశీలించిన ప్రభుత్వం వాటిని తిరస్కరిస్తూ సెప్టెంబర్ 4న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సెప్టెంబర్ 7న ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-3 పోస్టులకు యధావిధిగా పరీక్షలు నిర్వహిస్తామని పంచాయతీరాజ్ శాఖ స్పష్టం చేసింది.
Published on 9/5/2019 3:50:00 PM

సంబంధిత అంశాలు