Sakshi education logo

Advertisement

‘పీవో’కొలువులకు పిపరేషన్ గెడైన్స్...

బ్యాంకు జాబ్.. ఇటీవల కాలంలో యువతకు కొలువుల కామధేనువుగా మారింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి నిత్యం ఏదో ఒక ప్రకటన వెలువడుతోంది.
Career guidanceతాజాగా ఐబీపీఎస్ (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్).. 2020-21 ఆర్థిక సంవత్సరంలో..దేశంలోని జాతీయ బ్యాంకుల్లో పీవో పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా యువత డిగ్రీ అర్హతతోనే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉజ్వల కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. ఐబీపీఎస్ నోటిఫికేషన్ సమాచారం.. పీవో పోస్టుల ఎంపిక ప్రక్రియ.. పరీక్ష తీరుతెన్నులు..

ప్రిపరేషన్ గెడైన్స్...
4336 ఖాళీలు భర్తీ :
ఐబీపీఎస్ కామన్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా మొత్తం 17 జాతీయ బ్యాంకుల్లో 4336 పీవో/మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్ట్‌లను భర్తీ చేయనుంది. ఆ ఖాళీల వివరాలు...
బ్యాంక్ పోస్టుల సంఖ్య
అలహాబాద్ బ్యాంక్ 500
బ్యాంక్ ఆఫ్ ఇండియా 899
బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర 350
కెనరా బ్యాంక్ 500
కార్పొరేషన్ బ్యాంక్ 150
ఇండియన్ బ్యాంక్ 493
ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ 300
యూకో బ్యాంక్ 500
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 644
ఆంధ్రాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాల్లో పోస్ట్‌ల సంఖ్యను సున్నాగా పేర్కొంది. అదే విధంగా సిండికేట్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించి ఖాళీల పరంగా నాట్ రిపోర్టెడ్ అని తెలిపింది. నాట్ రిపోర్టెడ్ విభాగంలోని బ్యాంకులు తుది ఎంపిక సమయానికి ఖాళీల భర్తీకి ఐబీపీఎస్‌ను సంప్రదించే అవకాశముందని నిపుణుల అభిప్రాయం. అంటే.. ఖాళీల సంఖ్య ఇంకా పెరిగే వీలుంది.

మూడంచెల ఎంపిక ప్రక్రియ :
ఐబీపీఎస్ పీవో (సీఆర్‌పీ) ఎంపిక ప్రక్రియ మూండంచెల్లో నిర్వహించనుంది. అవి.. బ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, బ మెయిన్ ఎగ్జామినేషన్, బ పర్సనల్ ఇంటర్వ్యూ. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్స్ ఆన్‌లైన్ విధానంలో ఉంటాయి. వీటిలో నిర్దేశిత కటాఫ్‌ను సాధించిన అభ్యర్థులను తుది దశ పర్సనల్ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.

1. పిలిమినరీ పరీక్ష :
తొలిదశ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 100 ప్రశ్నలు-100 మార్కులకు జరుగుతుంది. ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ అనే మూడు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు ప్రిలిమినరీలో పొందిన మార్కులు, నిర్దేశిత కటాఫ్ మార్కుల ఆధారంగా మెయిన్ ఎగ్జామినేషన్‌కు ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్ నుంచి మెయిన్‌కు ఎంపిక చేసే అభ్యర్థుల సంఖ్య 1:10గా ఉంటుంది.
విభాగం ప్రశ్నల సంఖ్య మార్కులు సమయం
ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 30 20 ని.లు
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 35 20 ని.లు
రీజనింగ్ ఎబిలిటీ 35 35 20 ని.లు
మొత్తం 100 100 60 ని.లు
2. మెయిన్ ఎగ్జామినేషన్ : మెయిన్ పరీక్ష సైతం ఆన్‌లైన్ విధానంలోనే జరుగుతుంది. ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఇంగ్లిష్, రీజనింగ్ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్, జనరల్/ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్‌నెస్, డేటా అనాలసిస్ అండ్ ఇంటర్ ప్రిటేషన్‌పై ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 155 ప్రశ్నలు, 200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది. మెయిన్ పరీక్ష వ్యవధి మూడు గంటలు.
విభాగం ప్రశ్నలు మార్కులు సమయం
రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 45 60 60 ని.లు
జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్ 40 40 35 ని.లు
ఇంగ్లిష్ లాంగ్వేజ్ 35 40 40 ని.లు
డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ 35 60 45 ని.లు
మొత్తం 155 200 3 గం.లు
ఇంగ్లిష్ డిస్క్రిప్టివ్ టెస్ట్ :
మెయిన్‌లో పేర్కొన్న ఆబ్జెక్టివ్ విభాగాలతోపాటు ఇంగ్లిష్ డిస్క్రిప్టివ్ టెస్ట్‌ను కూడా నిర్వహిస్తారు. ఈ పరీక్షలో అభ్యర్థులు ఒక ఎస్సే, ఒక లెటర్ రైటింగ్ రాయాల్సి ఉంటుంది. ఒక్కో దానికి 25 మార్కులు. సమయం 30 నిమిషాలు. అభ్యర్థుల్లో ఇంగ్లిష్ పరిజ్ఞానాన్ని పరీక్షించడమే ఈ విభాగం ప్రధాన ఉద్దేశం.

3. తుది దశ.. పర్సనల్ ఇంటర్వ్యూ :
మెయిన్ ఎగ్జామినేషన్‌లో సాధించిన మార్కుల ఆధారంగా.. సెక్షన్‌ల వారీ కటాఫ్, ఓవరాల్ కటాఫ్‌లను నిర్దేశించి.. ఆ జాబితాలో నిలిచిన అభ్యర్థులకు చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూకు కేటాయించిన మార్కులు 100. ఇందులో అభ్యర్థులు తప్పనిసరిగా కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులు 40 శాతం మార్కులు, రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు 35 శాతం మార్కులు పొందాలి.

తుది జాబితాలో 80:20 వెయిటేజీ :
తుది జాబితా రూపకల్పనలో మెయిన్, పర్సనల్ ఇంటర్వ్యూలకు నిర్దేశిత వెయిటేజీ ఉంటుంది. మెయిన్ పరీక్షలో మార్కులకు 80 శాతం వెయిటేజీ, పర్సనల్ ఇంటర్వ్యూ మార్కులకు 20శాతం వెయిటేజీని నిర్దేశించారు. ఇలా తుది జాబితాలో నిలిచిన అభ్యర్థులను ఆయా బ్యాంకుల్లో 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఏర్పడే ఖాళీల్లో నియమిస్తారు.


సన్నద్ధత ఇలా...
ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే ప్రిలిమ్స్, మెయిన్‌లో రాణించడానికి అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా ప్రిపరేషన్ సాగించాలి. ప్రిలిమ్స్, మెయిన్ రెండింటిలో కీలకమైన రీజనింగ్ ప్రిపరేషన్ పరంగా అభ్యర్థులు పకడ్బందీగా వ్యవహరించాలి. సిరీస్, అనాలజీ, కోడింగ్-డీకోడింగ్, డెరైక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, ర్యాంకింగ్స్, సీటింగ్ అరేంజ్‌మెంట్స్, సిలాజిజమ్స్‌పై పట్టు సాధించాలి.

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ :
ఈ విభాగానికి సంబంధించి అర్థమెటిక్ చాలా కీలకం. స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, పర్సంటేజెస్, టైం అండ్ డిస్టెన్స్, టైం అండ్ వర్క్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియోస్ సంబంధిత ప్రశ్నలను బాగా ప్రాక్టీస్ చేయాలి. వీటితోపాటు నంబర్ సిరీస్, డేటా అనాలిసిస్ విభాగాలపైనా పట్టు సాధిస్తే... ప్రిలిమ్స్, మెయిన్.. రెండిటిలోనూ మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుంది.

డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ :
అభ్యర్థులు అత్యంత అప్రమత్తంగా ప్రిపరేషన్ సాగించాల్సిన విభాగం.. డేటా అనాలసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్. ఇందులో మంచి స్కోర్ సాధించేందుకు కాలిక్యులేషన్ స్కిల్స్‌ను పెంచుకోవాలి. టేబుల్స్, డయాగ్రమ్స్, నంబర్ డేటా, లైన్ గ్రాఫ్, బార్ గ్రాఫ్ తదితర గ్రాఫ్ ఆధారిత డేటాలోని సమాధానాన్ని క్రోడీకరించే విధంగా ప్రాక్టీస్ చేయాలి.

జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్ :
ఇటీవల కాలంలో దేశ ఆర్థిక రంగంలో తాజా పరిణామాలు.. బ్యాంకుల విధి విధానాల్లో మార్పులు.. అవి కొత్తగా ప్రకటిస్తున్న పథకాల గురించి తెలుసుకోవాలి. బ్యాంకింగ్, ఆర్థిక రంగంలో వినియోగించే పదజాలంపై పట్టు సాధించాలి.

ఇంగ్లిష్ లాంగ్వేజ్ :
ఇంగ్లిష్‌లో మార్కుల సాధనకు బేసిక్ గ్రామర్‌తో మొదలుపెట్టి వొకాబ్యులరీ పెంచుకోవడం వరకు కృషి చేయాలి. రీడింగ్ కాంప్రహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, జంబుల్డ్ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. 
డిస్క్రిప్టివ్ విధానంలో ఉండే ఇంగ్లిష్ ఎస్సే రైటింగ్, లెటర్ రైటింగ్ కోసం ఇంగ్లిష్ న్యూస్ పేపర్లు చదవడం, ఎడిటోరియల్ లెటర్స్ చదవడం మేలు చేస్తుంది.

నోటిఫికేషన్ సమాచారం :
విద్యార్హత: ఆగస్టు 28, 2019 నాటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయోపరిమితి: ఆగస్టు 1, 2019 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. గరిష్ట వయోపరిమితికి సంబంధించి ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ(నాన్ క్రీమీ లేయర్) అభ్యర్థులకు మూడేళ్ల వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం : అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి.
ఇందుకోసం www.ibps.in వెబ్‌సైట్ హోంపేజీలో కనిపించే సీఆర్‌పీ పీఓ/ఎంటీ లింక్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత క్లిక్ హియర్ టు అప్లై ఆన్‌లైన్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: ఆగస్టు 7-ఆగస్టు 28, 2019.
ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపు తేదీలు: ఆగస్టు 7- ఆగస్టు 28, 2019.
ప్రిలిమినరీ పరీక్షకు కాల్ లెటర్స్ డౌన్‌లోడ్: అక్టోబర్‌లో.
ప్రిలిమినరీ పరీక్ష (ఆన్‌లైన్) తేదీలు: అక్టోబర్ 12, 13, 19, 20.
ప్రిలిమినరీ ఫలితాల వెల్లడి: అక్టోబర్/నవంబర్.
మెయిన్ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్: నవంబర్ 2019.
మెయిన్ పరీక్ష తేదీ: నవంబర్ 30, 2019.
మెయిన్ పరీక్ష ఫలితాల వెల్లడి: డిసెంబర్ 2019.
ఇంటర్వ్యూ కాల్ లెటర్ డౌన్‌లోడ్: జనవరి, 2020
పర్సనల్ ఇంటర్వ్యూలు: 2020 జనవరి, ఫిబ్రవరిలో.
ప్రొవిజినల్ అలాట్‌మెంట్: 2020 ఏప్రిల్‌లో.

తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమినరీఎగ్జామినేషన్ కేంద్రాలు :
ఆంధ్రప్రదేశ్: చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం
తెలంగాణ: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.ibps.in\par

పీవోగా చేరి.. ఉన్నతస్థాయికి ఎదగొచ్చు
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పీవోగా కెరీర్ ప్రారంభించిన అభ్యర్థులు.. ఆయా బ్యాంకుల్లో అత్యున్నత పదవిగా భావించే చైర్మన్ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. స్కేల్-1 హోదాతో పీవోగా కెరీర్ ప్రారంభిస్తే.. రెండేళ్ల తర్వాత స్కేల్-2 కేడర్‌లో డిప్యూటీ మేనేజర్‌గా పదోన్నతి పొందొచ్చు. ఆ తర్వాత పనితీరు ఆధారంగా మేనేజర్ (స్కేల్-3), చీఫ్ మేనేజర్(స్కేల్-4), ఏజీఎం(స్కేల్-5), డీజీఎం(స్కేల్-6), జీఎం(స్కేల్-6) హోదాలు సొంతం చేసుకోవచ్చు. ఇవే కాకుండా.. పనితీరు ఆధారంగా చీఫ్ జనరల్ మేనేజర్, డిప్యూటీ మేనేజింగ్ డెరైక్టర్, మేనేజింగ్ డెరైక్టర్, చైర్ పర్సన్ వంటి ఉన్నతస్థాయి పదవులు పొందొచ్చు.

ప్రామాణిక పుస్తకాలు :
ఇప్పటినుంచే ప్రిపరేషన్ ప్రారంభిస్తే ప్రిలిమ్స్ పరీక్ష సమయానికి ఆయా విభాగాల్లో పట్టు సాధించడం సులభమే. అభ్యర్థులు ప్రామాణిక పుస్తకాలను అభ్యసనం చేయాలి. మ్యాథమెటిక్స్, అర్థమెటిక్ కోసం పదోతరగతి స్థాయి పుస్తకాలను చదవడం మేలు చేస్తుంది.
-మనోజ్ సేథి, బ్యాంక్ ఎగ్జామ్స్ కోచింగ్ హెడ్, టైమ్ ఇన్‌స్టిట్యూట్

ప్రాక్టీస్ ప్రధానం...
ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షలకు సంబంధించి అభ్యర్థులు ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. కేవలం ఆబ్జెక్టివ్ తరహాలో బిట్స్ చదవడం కాకుండా.. బేసిక్స్, ఫార్ములాల ఆధారంగా వాటిని ప్రాక్టీస్ చేయాలి. ఇందుకోసం ప్రతిరోజు నిర్దిష్టంగా సమయం కేటాయించుకోవాలి. అదే విధంగా రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి.
-ఎ.మోనిష్ కుమార్, ఐబీపీఎస్ పీఓ- 2017 విజేత (సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)
Published on 8/14/2019 1:02:00 PM

సంబంధిత అంశాలు