Sakshi education logo

Advertisement

నీట్-2019: ఏపీ విద్యార్థుల మార్క్స్, పెర్సంటైల్

సాక్షి, అమరావతి: నీట్-2019 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ర్యాంకులు జూన్ 17న విడుదలయ్యాయి. వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వీటిని విడుదల చేశారు.
Edu newsరాష్ట్ర ర్యాంకుల్లో మొదటి ర్యాంకు ఖురేషి అస్రా, రెండో ర్యాంకు పిల్లి భాను శివతేజ, మూడో ర్యాంకు సొదం శ్రీ నందన్‌రెడ్డి, నాలుగో ర్యాంకు గొంగటి కృష్ణవంశీ, ఐదో ర్యాంకు కొల్లా హర్షిత్ చౌదరి దక్కించుకున్నారు. ఏపీ నుంచి నీట్ రాసిన అభ్యర్థుల్లో 85 శాతం మంది అర్హత సాధించడం శుభ పరిణామమని మంత్రి అన్నారు. 46,718 మంది పరీక్ష రాస్తే 40,381 మంది అర్హత సాధించారని చెప్పారు.

ఏపీలో ఆ ఐదు కాలేజీలంటేనే విద్యార్థులకు ఆసక్తి :
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నా అందులో ఐదు వైద్య కళాశాలల వైపే ఎక్కువ మంది విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. నీట్‌లో మంచి ర్యాంకులు సాధించినవారు జాతీయ పూల్ కింద వివిధ రాష్ట్రాల్లో మంచి వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లు పొందే అవకాశమున్నా మన రాష్ట్ర కళాశాలల్లో చేరడానికే ఆసక్తిగా ఉన్నారు. ఆంధ్రా మెడికల్ కళాశాల (విశాఖపట్నం), గుంటూరు మెడికల్ కళాశాల, కర్నూలు మెడికల్ కళాశాల, కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల, తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర మెడికల్ కళాశాలల్లో చేరడానికే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. గతేడాది చివరి ర్యాంకులు పొందిన అభ్యర్థుల కటాఫ్ మార్కులు చూసుకున్నా ఆ ఐదు కళాశాలల్లోనే ఎక్కువ మార్కులు సాధించినవారు ఉన్నారు. అక్కడ సీటు రాని అభ్యర్థులే మిగతా కళాశాలల వైపు చూస్తున్నారు.

అధ్యాపకులు, మౌలిక వసతులే కారణం :
విద్యార్థులు ఆ ఐదు కళాశాలల వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం.. వాటిలో అధ్యాపకుల కొరత లేకపోవడం, మిగతా వాటితో పోలిస్తే మౌలిక వసతులు మెరుగ్గా ఉండటమే. అన్నిటికీ మించి ఔట్ పేషెంట్లు, ఇన్ పేషెంట్ల సంఖ్య ఎక్కువగా ఉండటం కూడా ఆ కళాశాలలను ఎంచుకోవడానికి కారణంగా నిలుస్తోంది. గతేడాది జనరల్ కేటగిరీలో విశాఖపట్నం ఆంధ్రా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్‌లో సీటు పొందిన చివరి ర్యాంకు అభ్యర్థికి 538 మార్కులు వచ్చాయి. అంటే ఎంతగా పోటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే గుంటూరు మెడికల్ కళాశాలలో చివరి ర్యాంకు పొందిన జనరల్ అభ్యర్థికి 533 మార్కులు వచ్చాయి. ఇలా పైన పేర్కొన్న ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఒక్క విజయవాడ సిద్ధార్థ మెడికల్ కళాశాల మినహా మిగిలిన నాలుగింటిలో చివరి ర్యాంకు పొందిన జనరల్ అభ్యర్థులకు 500 మార్కులు పైనే రావడం విశేషం.

సీటు వస్తుందో లేదో అనే అందోళన...
మరికొద్ది రోజుల్లో ఎంబీబీఎస్ సీట్ల భర్తీ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్ని మార్కులు వస్తే ప్రభుత్వ సీటు వస్తుందనే దానిపై విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. తమకు వచ్చిన మార్కులకు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీటు వస్తుందా? రాదా? అనే దానిపై విద్యార్థులు చర్చించుకుంటున్నారు. పైగా ఈ ఏడాది ప్రశ్నపత్రం సులువుగానే ఉండటంతో మెజారిటీ అభ్యర్థులు ఎక్కువ మార్కులు సాధించారు. దీంతో కటాఫ్ మార్కులు కూడా పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా.. ఈ ఏడాది ఎంబీబీఎస్ సీట్లు పెరిగే అవకాశం ఉండటంతో మరికొంతమందికి సీట్లు దక్కే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది నుంచే ఆర్థికంగా వెనుకబడిన బలహీనవర్గాలకు సీట్లు కేటాయించబోతున్నారు.త్వరలో నీట్‌లో మెరిట్ విద్యార్థుల జాబితాను వెల్లడించేందుకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

2018-19లో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చివరి సీట్లు పొందిన వారికి
కేటగిరీల వారీగా వచ్చిన కటాఫ్ మార్కుల వివరాలు..
కళాశాల బీసీఎ బీసీబి బీసీ సి బీసీ డి బీసీఇ జనరల్ ఎస్సీ ఎస్టీ
ఏసీఎస్‌ఆర్, నెల్లూర్ 443 456 436 461 428 474 370 359
ఏఎంసీ, విశాఖ 527 523 536 537 493 538 433 392
జీఎంసీ, అనంతపురం 463 471 427 466 466 489 389 388
జీఎంసీ, గుంటూరు 489 493 536 521 448 533 424 389
కేఎంసీ, కర్నూలు 485 508 487 498 503 520 422 405
రిమ్స్, ఒంగోలు 459 478 483 493 408 498 399 357
రిమ్స్, శ్రీకాకుళం 466 481 441 501 397 502 395 352
రిమ్స్, కడప 459 471 414 465 428 472 389 360
రంగరాయ, కాకినాడ 503 496 497 521 417 521 418 369
సిద్ధార్థ, విజయవాడ 393 458 489 475 444 459 377 366
ఎస్వీఎంసీ, తిరుపతి 481 485 446 487 428 517 409 400
పద్మావతి, తిరుపతి 449 453 415 457 415 469 369 355

కటాఫ్‌లు పెరిగే అవకాశం:

మరికొద్ది రోజుల్లో ఎంబీబీఎస్ సీట్ల భర్తీ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్ని మార్కులు వస్తే ప్రభుత్వ సీటు వస్తుందనే దానిపై విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. తమకు వచ్చిన మార్కులకు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీటు వస్తుందా? రాదా? అనే దానిపై విద్యార్థులు చర్చించుకుంటున్నారు. పైగా ఈ ఏడాది ప్రశ్నపత్రం సులువుగానే ఉండటంతో మెజారిటీ అభ్యర్థులు ఎక్కువ మార్కులు సాధించారు. దీంతో కటాఫ్ మార్కులు కూడా పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా.. ఈ ఏడాది ఎంబీబీఎస్ సీట్లు పెరిగే అవకాశం ఉండటంతో మరికొంతమందికి సీట్లు దక్కే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది నుంచే ఆర్థికంగా వెనుకబడిన బలహీనవర్గాలకు సీట్లు కేటాయించబోతున్నారు. నేడో, రేపో నీట్‌లో మెరిట్ విద్యార్థుల జాబితాను వెల్లడించేందుకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

For NEET 2018 AP cutoff marks and ranks admitted into various MBBS and BDS colleges -
Click Here

నీట్‌–2019 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్థాయి ర్యాంకులు :
Published on 6/18/2019 2:58:00 PM

సంబంధిత అంశాలు