Sakshi education logo

టెన్త్ విద్యార్థులకు నేటి నుంచి రివిజన్ క్లాసులు

Join our Community

facebook Twitter Youtube
సాక్షి, హైదరాబాద్: కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో పరీక్షలు వాయిదా పడిన పదో తరగతి విద్యార్థులకు దూరదర్శన్ యాదగిరి చానెల్ ద్వారా పునశ్చరణ తరగతులను ఏర్పాటు చేస్తున్నామని విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
Education Newsఈ తరగతులను ఆదివారం నుంచి ఈనెల 23 వరకు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇంగ్లిష్, గణితం, ఫిజికల్ సైన్స్, బయాలజీ, సోషల్ సబ్జెక్టులకు సంబంధించి ఈ పునశ్చరణ తరగతులుంటాయని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రయోజనం కోసం ఏర్పాటు చేసిన ఈ సౌకర్యాన్ని ఇంట్లో ఉండే సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
Published on 4/13/2020 3:32:00 PM

సంబంధిత అంశాలు