Sakshi education logo

పీహెచ్‌డీతో ఉజ్వల భవిత.. పరిశోధనలకు అవకాశం

Join our Community

facebook Twitter Youtube
ఇంటర్.. డిగ్రీ.. పోస్టు గ్రాడ్యుయేషన్.. తర్వాత ఏంటి?! చాలామందిలో సాధారణంగా ఉదయించే ప్రశ్న ఇది. పీజీ పూర్తయ్యాక కొందరు ఉద్యోగాల్లో చేరిపోవాలని కోరుకుంటే.. మరికొందరు రీసెర్చ్(పీహెచ్‌డీ) వైపు అడుగులు వేస్తుంటారు.
Edu newsపీహెచ్‌డీ పరంగా సైన్‌‌స, టెక్నాలజీ, ఫార్మసీ, ఇంగ్లీష్ లిటరేచర్, లింగ్విస్టిక్స్ కోర్సులు ముందు వరుసలో నిలుస్తుండటం విశేషం. సోషల్ సైన్స్, హుమానిటీస్ కోర్సుల్లో ఎకనామిక్స్‌కు క్రేజ్ ఉంది. పరిశోధనలకు ప్రాధాన్యం పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో పీహెచ్‌డీ పూర్తి చేసుకున్న వారికి ఉన్నత అవకాశాలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో...  పీహెచ్‌డీలో చేరేందుకు అర్హతలు.. డిమాండింగ్ సబ్జెక్టులు.. ఉన్నత అవకాశాల గురించి తెలుసుకుందాం..
 
 పీహెచ్‌డీ.. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ. దీన్నే డాక్టరేట్ అని కూడా పేర్కొంటారు. డాక్టరేట్ అనేది విలక్షణమైన పరిశోధన-ఆధారిత విద్యాభ్యాసంగా చెప్పొచ్చు. దీన్ని పూర్తి చేసిన వారిలో లోతైన పరిశోధన దృక్పథంతో పాటు సమస్యలపై సమగ్ర అవగాహన, అసాధారణమైన విశ్లేషణ, పరిశీలనా నైపుణ్యాలు ఉంటాయి. దాంతో కీలక సమస్యలను పరిష్కరించే సామర్థ్యం వీరి సొంతమవుతుంది. అంతేకాకుండా పీహెచ్‌డీ కోర్సును పూర్తిచేసే క్రమంలో ఎక్కువ గంటలు పనిచేయడంతోపాటు.. సంక్లిష్ట సమస్యలను విశ్లేషించి పరిష్కార మార్గాలు వెతికే నేర్పు అలవడుతుంది. ఈ లక్షణాలు ఉన్న పీహెచ్‌డీ అభ్యర్థులు తాము చేరిన విభాగాల్లో సమస్యలను పరిష్కరించడంలో ముందువరుసలో నిలుస్తారు.  పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌ను ఫుల్ టైమ్, పార్ట్ టైమ్‌గా చేసేందుకు అవకాశం ఉంది. వీటికి డిమాండ్ వాస్తవానికి విద్యార్థి పోస్టు గ్రాడ్యుయేషన్ ఏ సబ్జెక్టులో చేస్తే అందులోనే పీహెచ్‌డీ చేసేందుకు అవకాశం లభిస్తుంది. దేశంలో ఏటా  వేల మంది విద్యార్థులు పీహెచ్‌డీ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. పీహెచ్‌డీ చేసే అవకాశం మాత్రం కొందరికే లభిస్తోంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మెడికల్ బయాలజీ, ప్యూర్ బయాలజీ, స్టాటిస్టిక్స్, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఫిజికల్ కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, అన్ని ఇంజనీరింగ్ బ్రాంచ్‌లు, ఆర్గానిక్ కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, కాస్మోటాలజీ, కామర్స్, ఎకనామిక్స్, లా, లింగ్విస్టిక్స్, మేనేజ్‌మెంట్ వంటి కోర్సుల్లో పీహెచ్‌డీ చేయాలనే లక్ష్యంతో ఎక్కువమంది దరఖాస్తు చేసుకుంటున్నారు. మెడికల్ కోర్సుల్లో సైతం పరిశోధనల దిశగా అడుగులు వేసే వారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది.
 
 పీహెచ్‌డీకి అర్హతలు..
 మన దేశంలో 55 శాతం లేదా 60 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ చేసిన వారు  పీహెచ్‌డీలో చేరేందుకు అర్హులు. ఆయా విశ్వవిద్యాలయాలు, ఇన్‌స్టిట్యూట్స్ తమదైన ప్రత్యేక ప్రవేశ విధానాలను అనుసరిస్తున్నాయి. సీఎస్‌ఐఆర్ నెట్, యూజీసీ నెట్ పరీక్షల్లో ప్రతిభ  ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్‌ఎఫ్)కు అర్హత సాధిస్తే.. పీహెచ్‌డీలో చేరేందుకు మార్గం సుగమం అవుతుంది. జేఆర్‌ఎఫ్‌తో ఆర్థికంగా తోడ్పాటు లభిస్తుంది.  పీజీ పూర్తి చేసిన వారు, ఫైనల్ ఇయర్ విద్యార్థులు నెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజనీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో పీహెచ్‌డీ చేసేందుకు ‘గేట్ (గ్రాడ్యుయేట్ అప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్)’లో స్కోరు ఉపయోగపడుతుంది.
 
 విలువైన డిగ్రీ..
 పీహెచ్‌డీని దేశ విదేశాల్లో అత్యంత విలువైన డిగ్రీగా భావిస్తారు. డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసిన విద్యార్థి కెరీర్ గ్రాఫ్ కంటే.. పీహెచ్‌డీ ఉత్తీర్ణుల కెరీర్ మరింత ఉన్నతంగా ఉంటుంది. విస్తృత అవకాశాలు, ఉద్యోగాలలో త్వరగా పదోన్నతులు పొందేందుకు అవకాశం లభిస్తుంది. పీహెచ్‌డీ.. అనేకరకాల ఉపాధి మార్గాలను చూపిస్తుందనడంలో సందేహం లేదు. పీహెచ్‌డీ పట్టా పొందిన అభ్యర్థులు ఓ వైపు పరిశోధనలు చేస్తూనే.. మరోవైపు లెక్చరర్లుగా/ప్రొఫెసర్లుగా సేవలు అందించవచ్చు.
 
 సైంటిస్టులుగా..
 పీహెచ్‌డీ పూర్తయిన తర్వాత అభ్యర్థులు ఎక్కువగా యూనివర్శిటీ ప్రొఫెసర్ ఉద్యోగాన్ని కోరుకుంటారు. దీంతోపాటు ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబ్స్‌లో సైంటిస్టులుగా కూడా రాణించొచ్చు. ఫార్మా సంస్థలు, ఆటోమొబైల్, తయారీ రంగ కంపెనీలు తమ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగాల్లో నూతన ఆవిష్కరణలపై దృష్టిపెట్టేందుకు పీహెచ్‌డీ అభ్యర్థులను నియమించుకుంటున్నాయి. ఇటీవల కాలంలో స్టార్ట్-అప్ మెంటర్స్‌గా కూడా పీహెచ్‌డీ నిపుణులు సేవలు అందిస్తున్నారు.
 
 వేతనాలు..
 స్టాటిస్టిక్స్, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, ఫిజికల్ కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్‌‌స, ఆర్గానిక్ కెమిస్ట్రీ, కెమికల్ ఇంజనీరింగ్ తదితర విభాగాల్లో పీహెచ్‌డీ పూర్తి చేసినవారికి అమెరికా, ఇతర ఐరోపా దేశాల్లో  డిమాండ్ ఉంది. వీరికి ప్రారంభ వేతనం 1.10 లక్షల డాలర్ల వరకూ ఇస్తున్నారు. మన దేశంలో సైతం ఐఐఎస్సీ, ఐఐటీలు వంటి ప్రఖ్యాత ఇన్‌స్టిట్యూట్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసినవారికి  రూ.30 లక్షల దాకా వార్షిక వేతనం అందుతోంది. యూనివర్సిటీలు, స్టార్టప్స్‌తో పోలిస్తే.. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్ అండ్ డీ)లో, కార్పొరేట్ సంస్థల్లో వేతనాలు అధికంగా ఉంటారుు.
Published on 5/21/2020 4:01:00 PM

సంబంధిత అంశాలు