ఏపీలో ఫిబ్రవరి 27 నుంచి ఇంటర్ పరీక్షలు

బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు నవంబర్ 14న విశాఖలో విడుదల చేశారు.
Edu newsవచ్చే ఏడాది ఫిబ్రవరి 27 నుంచి ప్రథమ, 28 నుంచి ద్వితీయ సంవత్సర పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేశామని చెప్పారు. రాష్ట్రంలో 10,06,449 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతన్నారన్నారు. వీరిలో 5,25,729 మంది ప్రథమ, 4,80,720 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారని చెప్పారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరిగే ఈ పరీక్షల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 1,448 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వేల్యూస్ పరీక్షలు జనవరి 28న, ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ పరీక్ష జనవరి 30న ఉంటుందన్నారు. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు జంబ్లింగ్ పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

ఇంటర్ పరీక్షల షెడ్యుల్ ఇదే..
ఇంటర్ ఫస్ట్ ఇయర్...

పరీక్ష తేదీ

పరీక్ష పేపర్

27-02-2019 సెకండ్ లాంగ్వేజ్
01-03-2019 ఇంగ్లిష్
05-03-2019 మ్యాథ్స్-ఏ, బోటనీ, సివిక్స్
07-03-2019 మ్యాథ్స్-బి, జువాలజీ, హిస్టరీ
09-03-2019 ఫిజిక్స్, ఎకనామిక్స్
12-03-2019 కెమిస్టీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్‌ఆర్‌‌ట్స, మ్యూజిక్
14-03-2019 జియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్,లాజిక్, బ్రిడ్‌‌జకోర్సు మ్యాథ్స్
16-03-2019 మోడ్రన్ లాంగ్వేజ్

ఇంటర్ సెకండ్ ఇయర్...

పరీక్ష తేదీ

పరీక్ష పేపర్

28-02-2019 సెకండ్ లాంగ్వేజ్
02-03-2019 ఇంగ్లిష్
06-03-2019 మ్యాథ్స్-ఏ, బోటనీ, సివిక్స్
08-03-2019 మ్యాథ్స్-బి, జువాలజీ, హిస్టరీ
11-03-2019 ఫిజిక్స్, ఎకనామిక్స్
13-03-2019 కెమిస్టీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్‌ఆర్‌‌ట్స, మ్యూజిక్
15-03-2019 జియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, బ్రిడ్‌‌జకోర్సు మ్యాథ్స్
18-03-2019 మోడ్రన్ లాంగ్వేజ్
Published on 11/15/2018 1:41:00 PM
టాగ్లు:
AP Inter public exams AP Inter public examsdates AP inter public exams time table 2019 AP inter public exams schedule Ganta srinivasa rao AP Inter public examscentres AP inter practicals exams dates

Related Topics